ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అనగా భారత ప్రభుత్వం యొక్క ప్రీమియర్ పరిపాలనా పౌర సేవ. ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు మరియు పబ్లిక్ రంగ సంస్థలలో పట్టున్న మరియు వ్యూహాత్మక స్థానాలున్నవారు. ఈ అధికారులు ప్రభుత్వ విధానాలను అమలు పరచి పర్యవేక్షిస్తారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సమాజంలో పేరు ప్రఖ్యాతలున్న గొప్ప సేవగా గుర్తింపు పొందింది. ఈ సేవ ద్వారా ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతారు మరియు అమలు పరచగలుగుతారు. ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ జిల్లా, రాష్ట్రం, దేశం యొక్క మూడు స్థాయుల్లోనూ పనిచేయగలిగిన ఏకైక సర్వీసు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికైనవారు మొదట అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పదోన్నతుల ద్వారా వరుసగా పై హోదాలకు చేరుకుంటారు. ఉదాహరణకు
- అసిస్టెంట్ కలెక్టర్ → కలెక్టర్ → డిప్యూటీ కమిషనర్ → డిప్యూటీ సెక్రటరీ → డిప్యూటీ డెరైక్టర్
- అసిస్టెంట్ కలెక్టర్ → కలెక్టర్ → డిప్యూటీ కమిషనర్ → అడిషనల్ సెక్రటరీ → జాయింట్ సెక్రటరీ → డెరైక్టర్
- అసిస్టెంట్ కలెక్టర్ → సెక్రటరీ → కమిషనర్ అండ్ సెక్రటరీ → ప్రిన్సిపల్ సెక్రటరీ → ఫైనాన్షియల్ కమిషనర్ → చీఫ్ సెక్రటరీ → చైర్మన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్
Service Overview | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Formed | 1893 (As Imperial Civil Service) | |||||||||||
Country | ![]() | |||||||||||
Staff College | Lal Bahadur Shastri National Academy of Administration, Mussoorie, (Uttarakhand) | |||||||||||
Cadre Controlling Authority | Ministry of Personnel, Public Grievances and Pension, Department of Personnel and Training | |||||||||||
Legal personality | Governmental: Government service | |||||||||||
Duties | Law & Order Management
Law Implementation Policy Formulation | |||||||||||
Preceding service | Imperial Civil Service (1893–1946) | |||||||||||
Cadre Strength | 5196 members (2016)[1] | |||||||||||
Selection | Union Public Service Commission's (UPSC) Civil Services Examination | |||||||||||
Association | IAS Officers Association | |||||||||||
Head of the All India Civil Services | ||||||||||||
Cabinet Secretary Current: Pradeep Kumar Sinha, IAS |
జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ సాధారణంగా కలెక్టర్ గానే సూచించబడతారు, ఇతను ఒక భారతీయ జిల్లా యొక్క ముఖ్య పరిపాలకుడు మరియు రెవిన్యూ అధికారి. కలెక్టర్ అలాగే జిల్లా మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ మరియు, కొన్ని జిల్లాల్లో డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ గాను సూచింపబడతారు. జిల్లా కలెక్టర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యుడు, మరియు కేంద్ర ప్రభుత్వముచే నియమింపబడతాడు.
సివిల్ సర్వీస్ పరీక్ష
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎంపికకు సివిల్ సర్వీస్ పరీక్ష వ్రాయాలి. ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు డిగ్రీ ప్రధాన అర్హత. వయస్సు 21-32 సంవత్సరాలలోపు ఉండాలి.
మూలాలు
- "2016 Total Cadre strength of IAS as in January 2016" (PDF). Ministry of Personnel, Public Grievances and Pension. Retrieved 22 January 2012.