గణతంత్ర దినోత్సవం

ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" దినం. భారతదేశంలో గణతంత్ర దినోత్సవము మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది.[1]

గణతంత్ర దినోత్సవం
మద్రాసు రెజిమెంట్ సైనికులు 2004 గణతంత్రదినోత్సవ పేరేడ్ లో కవాతు జరుపుతున్న దృశ్యం
జరుపుకొనేవారుభారతదేశం
రకంజాతీయ
జరుపుకొనే రోజు26 జనవరి
ఉత్సవాలుపేరేడ్, విద్యాలయాల్లో తీపిమిఠాయులు పంచడం మరియు సాంస్కృతిక ప్రదర్శనలు
ఆవృత్తిప్రతిసంవత్సరం
అనుకూలనంసంవత్సరంలో అదే రోజు
భారతజాతీయపతాకంలోని మూడు రంగుల రూపంతో బెలూన్లు.

భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యము వచ్చింది. దేశానికి రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలము పట్టింది. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచడంతో భారతదేశము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది.

1930 జనవరి 26 న పూర్ణ స్వరాజ్ కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు కావటంతో 26 జనవరిని ఎంపిక చేశారు[2]

భారతదేశానికి మూడు జాతీయ సెలవు దినాలలో ఇది ఒకటి. మిగతావి స్వాతంత్ర్య దినోత్సవం మరియు గాంధీ జయంతి.ఈ రోజు డిల్లీలో పరేడ్లు నిర్వహిస్తారు.సాహస బాల బాలికలకు భారత రాష్ట్రపతి పురస్కారాలు అందజేస్తారు.

ఇతర దేశాలు

దేశం పేరు గణతంత్ర దినోత్సవం జరుపుకొనే రోజు
ఇటలీ జూన్ 2
చైనా అక్టోబర్ 10
రొడీషియా అక్టోబరు 24
కజకిస్తాన్ అక్టోబరు 25
మాల్దీవులు నవంబర్ 11
బ్రెజిల్ నవంబర్ 15
యుగోస్లేవియా నవంబర్ 29
మాల్టా డిసెంబరు 13
నైజర్ డిసెంబరు 18
రొమానియా డిసెంబరు 8
అల్బేనియా జనవరి 11 (1946)
ఆర్మేనియా మే 28 (1918)
అజర్‌బైజాన్ మే 28 (1918)
బుర్కినా ఫాసో డిసెంబరు 11 (1958), అప్పర్ వోల్టా ఫ్రెంచి సమూహంలో రిపబ్లిక్ అయినది.)
తూర్పు జర్మనీ అక్టోబరు 7
గాంబియా ఏప్రిల్ 24 (1970)
గ్రీసు జూలై 24 (1974)
ఘనా జూలై 1 (1960)
గయానా ఫిబ్రవరి 23 (1970, ఇంకో పేరు మష్ర్‌మాని)
ఐస్‌లాండ్ జూన్ 17 (1944)
ఇరాన్ ఏప్రిల్ 1 ఇస్లామిక్ రిపబ్లిక్ డే
ఇరాక్ జూలై 14
కెన్యా డిసెంబరు 12 (1963, చూడండి జమ్‌హూరి దినం.)
లిథువేనియా మే 15 (1920, ఇంకో పేరు లిథువేనియా రాజ్యాంగ శాసనసభ దినము)
మాల్దీవులు నవంబర్ 11 (1968)
నేపాల్ మే 28 (2008)
నైగర్ డిసెంబరు 18 (1958)
ఉత్తర కొరియా సెప్టెంబరు 9 (1948)
పాకిస్తాన్ మార్చి 23 (1956)
పోర్చుగల్ నవంబర్ 15 (1991)
సియెర్రా లియోన్ ఏప్రిల్ 27, (1961)
ట్యునీషియా జూలై 25, (1957)
టర్కీ అక్టోబరు 29 (1923)

చిత్రమాలిక

మూలము

  1. "Introduction to Constitution of India". Ministry of Law and Justice of India. 2008-07-29. Retrieved 2008-10-14.
  2. "Indian Republic Day Celebrations". wikinewslive.com. Retrieved 2014-01-17.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.