భారత జాతీయగీతం

జనగణమన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. 1911లో మొదటి సారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది [[:Media:|వినండి]] . అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను పోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.

జాతీయగీత పాఠం

జనగణమన-అధినాయక జయ హే భారతభాగ్యవిధాతా!
పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ బంగ
వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛలజలధితరంగ
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే,
గాహే తవ జయగాథా।
జనగణమంగళదాయక జయ హే భారతభాగ్యవిధాతా!
జయ హే, జయ హే, జయ హే, జయ జయ జయ జయ హే।।

తెలుగు తాత్పర్యం

పంజాబు, సింధు, గుజరాత్ మహారాష్ట్ర లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతాము

తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతము

ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కల ప్రాంతము

ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము..

వింధ్య హిమాలయ పర్వతాలు,

యమున గంగలు

పై కంటే ఎగసే సముద్ర తరంగాలు

ఇవన్నీ..

తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి

తమరి శుభ ఆశిస్సుల నే కోరుకుంటున్నాయి

తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి

ఓ జనసమూహాల మనసుల అధినాయక..

మీకు జయము!

ఓ భారత భాగ్య విధాత, మీకు జయము! నిత్య జయము!

పాదపీఠికలు

    మూలాలు

    • Dutta, K & Robinson, A ({{{Year}}}).

    బయటి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.