జనతా పార్టీ

1975లో విధించిన అత్యవసర స్థితి తరువాత విపక్ష పార్టీలన్నీ ఒకే పార్టీగా అవతరించాలని నిర్ణయించాయి. అలా ఏర్పడినదే జనతా పార్టీ. ఇందులో భారతీయ జనసంఘ్, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్ (ఓ) ముఖ్య పార్టీలు. ఈ పార్టీకి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జయప్రకాష్ నారాయణ నేతృత్వం వహించారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది జనతాపార్టీ. అప్పుడు మొరార్జీ దేశాయ్ దేశంలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు.

జనతా పార్టీ
जनता पार्टी
వ్యవస్తాపకుడుజయప్రకాష్ నారాయణ
స్థాపన23 జనవరి 1977
రద్దు11 ఆగష్టు 2013
రంగు         Orange, Green

ఆ తరువాత రెండేళ్ళకు అంతర్గత కలహాలతో జనతా ప్రభుత్వం కూలిపోయింది. జనతా పార్టీలో చీలికలు వచ్చి భారతీయ జనతా పార్టీ, జనతా దళ్ వంటి పార్టీలు పుట్టాయి. తరువాత 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆగస్టు 2013 లో ఈ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబడింది.[1][2][3]

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.