కాదంబినీ గంగూలీ

కాదంబినీ గంగూలీ (బెంగాళీ: কাদম্বিনী গাংগুলী ) (1861అక్టోబర్ 3 1923) బ్రిటీషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన తొట్టతొలి వనితలలో ఒకరు. దక్షిణ ఆసియా నుండి పాశ్చాత్య వైద్యములో శిక్షణ పొందిన తొలి మహిళా వైద్యురాలు.

కాదంబినీ గంగూలీ
జననం 1861
భగల్ పూర్
మరణం అక్టోబర్ 3, 1923
కోల్కతా
వృత్తి వైద్యురాలు, స్త్రీవిమోచన కార్యకర్త
భార్య/భర్త ద్వారకానాథ్ గంగూలీ

తొలి జీవితం

బ్రహ్మ సమాజ సంస్కర్త, బ్రజ కిషోర్ బాసు కుమార్తె అయిన కాదంబినీ బ్రిటీషు ఇండియాలోని బీహార్ రాష్ట్రపు భగల్‌పూర్‌లో జన్మించింది. వీరి కుటుంబము ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని బరిసాల్ జిల్లాకు చెందిన చాంద్సీకి చెందినది. ఈమె తండ్రి భగల్‌పూర్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవాడు. ఆయన అభయచరణ్ మల్లిక్‌తో కలిసి భగల్‌పూర్‌లో స్త్రీజనోద్దరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. వీరు 1863లో భారతదేశములోనే తొట్టతొలి మహిళా సంస్థ అయిన భగల్‌పూర్‌ మహిళా సమితిని ప్రారంభించారు.

కాదంబినీ తన విద్యాభ్యాసాన్ని వంగ మహా విద్యాలయలో ప్రారంభించింది. జాన్ ఎలియట్ డ్రింక్ వాటర్ బెథూన్ స్థాపించిన బెథూన్ పాఠశాలలో ఉండగా 1878లో ఈమె కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలైన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఈమె కృషికి గుర్తింపుగా బెథూన్ కళాశాల మొదటిసారిగా ఎఫ్.ఎ (ఫర్స్ట్ ఆర్ట్స్), ఆ తరువాత 1883లో గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈమె మరియు చంద్రముఖి బాసు బెథూన్ కళాశాలనుండి ఉత్తీర్ణులులైన తొలి విద్యార్థినులు. తద్వారా మొత్తం దేశములోను మరియు బ్రిటీషు సామ్రాజ్యములోను పట్టభద్రులైన తొలి మహిళలుగా గుర్తింపుపొందారు.[1]

మూలాలు

  1. Female students were admitted into ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయములో తొలి మహిళా విద్యార్ధులను 1879లో చేర్చుకున్నారు. కానీ కలకత్తా విశ్వవిద్యాలయములో డిగ్రీ కోర్సులలో మహిళలకు అంతకు ముందు సంవత్సరమే తొలిసారిగా ప్రవేశము కల్పించారు.. కేంబ్రిడ్జిలోని ట్రిపోస్ మహిళలకు 1881 దాకా ప్రవేశము కల్పించలేదు.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.