గవిడి శ్రీనివాస్
గవిడి శ్రీనివాస్ తెలుగు కవి, గీత రచయిత.[1] అతను రాసిన కవితలు పత్రికల్లో అచ్చై పుస్తక రూపంలో ప్రచురితమయ్యాయి.[2][3][4]
గవిడి శ్రీనివాస్ | |
---|---|
![]() గవిడి శ్రీనివాస్ | |
పుట్టిన తేదీ, స్థలం | గవిడి శ్రీనివాస్ 1977 జూన్ 13 గాతాడ, మెరకముడిదాం మండలం |
వృత్తి | రచయిత |
పౌరసత్వం | భారతీయుడు |
జీవిత విశేషాలు
గవిడి శ్రీనివాస్ 1977, జూన్ 13 న గాతాడలో జన్మించారు. తిమిటేరు బూర్జవలసలో ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు 10 కిలోమీటర్లు దూరం ఉన్న దత్తి హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత గవిడి కన్నప్పల నాయుడు . తల్లి అరుణ కుమారి , తండ్రి సూర్యనారాయణ విలేజ్ రెవెన్యూ ఆఫీసరుగా పనిచేసేవారు. 1999 నుండి 2010 వరకు సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. 2010 నుండి నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు.సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజీ నుండి బి.ఎడ్ . పూర్తి చేశారు .ఈయన కు జీవిత భాగస్వామి అనురాధ పిల్లలు టబుశ్రీ , దీపశిఖ , నవనీత్ఉన్నారు.ఇతనికి ఇద్దరు తమ్ముళ్లు రామకృష్ణ మరియు పరమేష్ , చెల్లి పావని వున్నారు . ఈయన తాతయ్య వలిరెడ్డి అప్పలనాయుడు దగ్గర పెరిగారు . తాతయ్య ఉపాద్యాయుడు , సర్పంచ్ గా చేశారు.
రచనలు
ఇతను రామసూరి, అద్దేపల్లి, కె. శివారెడ్డి, భావశ్రీ వంటి కవుల ప్రోత్సాహం తో సాహిత్య రచన ప్రారంభించాడు.
- కన్నీళ్లు సాక్ష్యం (కవితల సంపుటి 2005 ) యువస్పందన ప్రచురణ [5]
- వలస పాట (కవితల సంపుటి 2015) సాహితీ స్రవంతి ప్రచురణ [6]
ఇతను పలు పాటలు కూడా రచించాడు.