నైవేద్యం
నైవేద్యం అనునది భుజించడానికి మునుపు దేవునికి ఆహారము సమర్పించు ప్రక్రియ. కావున దేవునికి ఆహారము సమర్పించు మునుపు, ఆ ఆహారము వండునప్పుడు దాని రుచి చూడటము నిషిద్ధము. ఆహారమును దేవుని మూర్తి ముందు ఉంచి పూజించడం జరుగుతుంది. ఆ పై దానిని పుణ్యఫలంగా ఆరగించవచ్చు.
ధారావాహిక లోని భాగంగా |
![]() ![]() |
---|
![]() |
భావనలు
|
భారతీయ దర్శనములు
|
హిందూ దేవతలు |
|
అభ్యాసములు
|
|
ఇతర విషయములు
|
ఈ పదము సంస్కృతం నుండి వచ్చింది. నైవేద్యము అంటే సరైన అర్థము దేవునికి సమర్పణ అని - ఈ సమర్పణ ఆహారపదార్థమే కానవసరము లేదు. ఈ సమర్పణ భౌతిక వస్తు సంబంధమే అవ్వవలసిన అవసరము లేదు. ఒక మొక్కు, ప్రతిజ్ఞ, ఏదైనా చేయవలను లేక చేయరాదు అన్న నిశ్చితాభిప్రాయము మున్నగునవన్నీ కూడా నైవేద్యముగా భావించవచ్చు. అయితే నైవేద్యానికి, ప్రసాదానికి ఉన్న తేడా తెలుసుకోవడం అవసరం. వాడుకలో రెండూ సమానార్థంలో ఉపయోగించినప్పటికీ, ప్రసాదమంటే దేవుని దగ్గర లభ్యమయ్యేదిగా అర్థం.
ఇవి కూడా చూడండి
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.