ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి [1][2] ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్ పక్షాన1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా నవ్య వారపత్రిక, ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ నడుపబడుతున్నాయి.
ఆంధ్రజ్యోతి | |
---|---|
![]() | |
రకము | ప్రతిదినం |
ఫార్మాటు | బ్రాడ్షీట్ |
యాజమాన్యం: | కె.ఎల్.ఎన్.ప్రసాద్ (తొలి దశ), ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్(మలిదశ) |
ప్రచురణకర్త: | వేమూరి రాధాకృష్ణ |
సంపాదకులు: | కె.శ్రీనివాస్ |
స్థాపన | 1960-07-01 విజయవాడ, ఆంధ్రప్రదేశ్, 2002-10-15(కొత్త నిర్వహణ)[1] |
నిర్వహణ ఆగిపోయిన | 2000-12-30 నుండి 2002-10-14 |
వెల | భారతదేశం రూపాయలు:5.00 సోమ వారం-శని వారం రూ.6.00 ఆది వారం |
ప్రధాన కేంద్రము | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్,ఇండియా |
| |
వెబ్‌సైటు: http://andhrajyothy.com |
1960-2000

మొదట నార్లతో విద్వాన్ విశ్వం, నండూరి రామమోహనరావు సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత సంపాదకులుగా పనిచేసినవారిలో ముఖ్యులు నండూరి రామమోహనరావు, తుర్లపాటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ. 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, నండూరి రామమోహనరావు ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి సంపాదకత్వం స్వీకరించాడు. నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత ఇనగంటి వెంకట్రావు సంపాదకులైనారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడింది.
2002-
2002 అక్టోబరు 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టరుగా పనిచేసిన వేమూరి రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టరుగా, కె.రామచంద్రమూర్తి సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతో ఒకేసారి తిరిగి ప్రారంభించబడింది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించింది. 2008 నుండి కె.శ్రీనివాస్ సంపాదకుడిగా ఉన్నాడు. వేమన వసంత లక్ష్మి, నవ్య అనుబంధం మరియు ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా, జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురందరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా ఉన్నారు.
భాష
ఆంధ్రజ్యోతి శైలి, అన్న ప్రచురణ ఈ పత్రిక యాజమాన్యం ప్రచురించింది.
శీర్షికలు, విశిష్టతలు
ప్రముఖ కాలమిస్టులు
శీర్షిక | కాలమిస్టు | ప్రచురణ వారం, విషయాలు |
---|---|---|
సందర్భం[11] | కె. శ్రీనివాస్ | వార్తావిశ్లేషణ |
దీప శిఖ [12] | రాజ్ దీప్ సర్దేశాయ్ | శుక్రవారం, వార్తావిశ్లేషణ |
పత్రహరితం [13] | మేనకా గాంధీ | జీవకారుణ్యం |
సమాంతరం[14] | సుధీంధ్ర కులకర్ణి | |
భరత వాక్యం [15] | భరత్ ఝన్ ఝన్ వాలా | వార్తా విశ్లేషణ |
గతానుగతం [16] | రామచంద్ర గుహ | చారిత్రిక విశ్లేషణ |
గమనం[17] | తెలకపల్లి రవి | వార్తా విశ్లేషణ |
ఇండియాగేట్[18] | ఎ కృష్ణారావు | జాతీయ వార్తా విశ్లేషణ |
కొత్త పలుకు[19] | వేమూరి రాధాకృష్ణ |
గతంలో ప్రాణహిత శీర్షికన అల్లం నారాయణ తెలంగాణ వాదం విశ్లేషించారు.
ఆన్ లైన్ రూపాలు
ఆన్లైన్ సంచిక వివిధరూపాల్లో లభ్యమవుతున్నది.
- హెచ్టిఎమ్ఎల్ పాఠ్యం రూపంలో ఇంటర్నెట్ లో ఆంధ్రజ్యోతి [2] అందుబాటులో ఉంది. మొదట్లో స్వంత ఖతి "శ్రీ తెలుగు" వుపయోగించిన తరువాత ప్రామాణిక యూనికోడ్‌కి మార్చబడింది. పాత సంచికలు వెబ్సైట్ కొత్త రూపంతో అందుబాటులోలేవు
- పిడీయఫ్ ఆంధ్రజ్యోతి ఈపేపర్ లింకు
ఈ పిడీయఫ్ ఆన్‌లైన్ సంచికలో ఆంధ్రజ్యోతి పేపరును అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. గత పది రోజుల పేపరు మాత్రమే అందుబాటులో వుంటుంది. - 2007 నుండి ముఖ్య వ్యాసకర్తల వ్యాసాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.
- వెబ్ సేవల్లో ప్రధానాంశమైన అన్వేషణ ఈ వెబ్‌సైటులో ఉండదు.
విమర్శలు
వైయస్స్ఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన భారీ అవినీతి మీద పలు పరిశోధనాత్మక కథనాలను ప్రచురించుట చేత ప్రభుత్వ వ్యతిరేక పత్రికగా ముఖ్యమంత్రి చేత పలు సార్లు ఆక్షేపించబడింది.
ఇవి కూడా చూడండి
మూలాలు
- బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రజ్యోతి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 412–413.
- ఆంధ్రజ్యోతి
- -నవ్య-ప్రత్యేక కథనం
- ఆదివారం అనుబంధం
- వివిధ సాహిత్య వేదిక
- [ http://www.andhrajyothy.com/taxonomy/term/1658 దిక్చూచి(విద్య,ఉద్యోగావకాశాల ప్రత్యేకం)]
- సకల ప్రత్యేక కథనాలు
- చింతన-ఆధ్యాత్మిక కథనాలు
- వైద్యం
- సంస్కృతి
- సందర్భం-కె. శ్రీనివాస్
- దీప శిఖ-రాజ్ దీప్ సర్దేశాయ్
- పత్రహరితం-మేనకా గాంధీ
- సమాంతరం-సుధీంధ్ర కులకర్ణి
- భరత వాక్యం -భరత్ ఝన్ ఝన్ వాలా
- గతానుగతం-రామచంద్ర గుహ
- గమనం-తెలకపల్లి రవి
- ఇండియాగేట్-ఎ కృష్ణారావు
- కొత్త పలుకు-ఆర్కె