తిరువూరు
తిరువూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా లోని జనగణన పట్టణం. పిన్ కోడ్: 521 235., ఎస్.టి.డి.కోడ్ = 08673.
గ్రామ చరిత్ర
శ్రీ కృష్ణదేవరాయలు 1540 లో కొండపల్లి జైత్రయాత్రకి వెలుతూ దీన్ని దర్శించారు.
గ్రామం పేరు వెనుక చరిత్ర
పేరెలా వచ్చింది-?
నాలుగు శతాబ్దాలకు పూర్వం, ప్రస్తుత తిరువూరు, "లక్ష్మీపురం" అనే వ్యవహారనామంతో కొనసాగేది. రావు బహద్దూరు జమీందారుల పాలనలో ఉండేది. అప్పట్లో, అన్నాజీరావు దంపతులు, తిరుపతి పుణ్యక్షేత్రానికి ఎడ్లబండిపై ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ అర్చకుడు, 16 కళలలో ప్రాణప్రతిష్ఠ చేసిన శఠగోపాన్ని వీరికి అందించారు. శఠగోపంతో తిరిగి వచ్చిన దంపతులు, తమ ఇంటిప్రక్క స్థలంలో, ఆలయాన్ని నిర్మించారు. శ్రీపతి, తిరుపతి నుండి రావటం వలన, "తిరు" అనీ, ఊరూరా శఠగోపం పూజలందుకోవడం వలన "వూరు" అనీ, వెరసి, "తిరువూరు"గా నామకరణం చేశారు. దీనితో, నాటి లక్ష్మీపురం, నేడు, "తిరువూరు" పేర కొనసాగుచున్నది. [2]
గ్రామ భౌగోళికం
ఇది విజయవాడ నగరమునకు 74 కి.మీ ల దూర౦లొ ఉంది.ఇది దాని చుట్టు పక్కల వున్న 51 గ్రామాలకు ప్రధాన వ్యాపార కేంద్రము.సముద్రమట్టానికి 73 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30).[1]
సమీప గ్రామాలు
అక్కపాలెం 4 కి.మీ, కోకిలపాడు 5 కి.మీ, ఆంజనేయపురం 5 కి.మీ రోలుపాడు; 7 కి.మీ, వావిలాల 9 కి.మీ,కొమ్మిరెడ్డిపల్లి 15కి. మీ, ముష్టికుంట్ల 12కి. మీ, వామకుంట్ల10కి. మీ, మునుకుళ్ళ4కి. మీ,వావిలాల 8 కి.మీ.[1]
సమీప మండలాలు
పెనుబల్లి, కల్లూరు, గంపలగూడెం, ఎ.కొండూరు.[1]
గ్రామానికి రవాణా సౌకర్యాలు
తిరువూరు, పుటెఏల నుండి రోడ్దురవాణా సౌకర్యంకలదు. రైల్వేస్టేషన్; మల్లెమడుగు, రామవరప్పాడు, విజయవాడ 73 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
కళాశాలలు
- శ్రీ వాహిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్&టెక్నాలజీ-08673-203199,09440166806,99595612345&9618363646
- శ్రీ సత్య బి.యి.డి.కళాశాల:- "ప్రతిఙ" రచయిత శ్రీ పైడిమర్రి వెంకటసుబ్బారావు పేరును తెలుగు రాష్ట్రాలలో అన్ని పాఠ్య పుస్తకాలలోనూ ముద్రించారు. అలాగే వీరి పేరును దేశంలోని అన్ని రాష్ట్రాల పాఠ్య పుస్తకాలలోనూ ముద్రించవలెనని కోరుతూ, జనవిఙాన వేదిక ఆధ్వర్యంలో, ఈ కళాశాలలో, 2015,అక్టోబరు-14వ తేదీనాడు, లక్ష సంతకాలతో ఒక ఉద్యమం ప్రారంభించారు. [4]
- నాగర్జున డిగ్రీ కళాశాల.
- ప్రతిభ కళాశాల.
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల
- ప్రశాంతి డిగ్రీ కళాశాల
- సాయి డిగ్రీ కళాశాల
- శ్రీ లక్కినేని రామయ్య ప్రతిభ మోడల్ డిగ్రీ కళాశాల
- ప్రభుత్వ జూనియర్ కళాశాల,
- శ్రీ నిధి జూనియర్ కళాశాల
- నాగర్జున జునియర్ కళాశాల.
- అక్షర జూనియర్ కళాశాల
పాఠశాలలు
- St. Ann's School (EM &TM), TIRUVURU
- VIDYA PUBLIC SCHOOL(T.M),TIRUVURU
- లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, తిరువూరు.
- St.Thomas High School, Tiruvuru
- vijaya bala nikaten, తిరువూరు
- భాష్యం సైంటిఫిక్ ఉన్నత పాఠశాల{EM}, తిరువూరు.
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరువూరు
- శ్రీ నిధి -టెక్నో స్కూల్ {EM}, తిరువూరు.
- శ్రీ చైతన్య -టెక్నో స్కూల్{EM}, తిరువూరు.
- ప్రశాంతి విద్యానికేతన్, తిరువూరు.
- నోబుల్ ఉన్నత పాఠశాల, తిరువూరు.
- నాగార్జున మెరిట్ పాఠశాల{EM}, తిరువూరు.
- సెయింట్.ఆన్స్ స్కూల్ {EM}, తిరువూరు.
- శ్రీ నిధి టెక్నొ స్కూల్ (E.M); tiruvru.
- vision high school (EM); tiruvuru.
- ఆంధ ప్రదేశ్ పభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల.
- Vignan Public School, Tiruvuru
గ్రామంలో మౌలిక వసతులు
వైద్య సదుపాయలు
1.కల్యాణి నర్సింగ్ హొమ్ - (బొసు బొమ్మ సెంటర్-తిరువూరు).
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మల్లమ్మ చెరువు:- చెరువులకు పూర్వవైభవం తీసుకొని రావాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు పథకం క్రింద, 2015,ఆగస్టు-14వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెరువులోని సారవంతమైన మట్టిని రైతులు ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [3]
నగర పంచాయతీ
- గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనందు రెండవ పెద్ద గ్రామపంచాయితి.
- 2011 సం.లో తిరువూరు పురపాలక సంఘంగా ఏర్పడింది. 2011 సం.నకు మొత్తము జనాభా సుమారు 50,000. మొత్తము వార్డులు 20. వార్షిక ఆదాయము సుమారు 90 లక్షలు.
తిరువూరులోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
- శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, శాంతి నగర్
- శ్రీ రామాలయం, నడిమ తిరువూరు
- శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, పాతూరు.
- శ్రీ అయ్యప్పస్వామి సహిత శ్రీ పంచముఖ హనుమత్ క్షేత్రం, బైపాస్ రోడ్:- ఈ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా, 2015,నవంబరు-5వ తేదీ గురువారంనాడు, ఈ క్షేత్రంలో నెలకొన్న 58 అడుగుల ఎత్తయిన శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహానికి విద్యుత్తు మోటార్లద్వారా క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదలను అందజేసినారు. [5]
- శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం, నడిమ తిరువూరు
- శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, బస్సు స్టాండ్ సెంటర్ (ప్రధాన అర్చకులు : భవాని రాధాకృష్ణ)
- పాత శివాలయం, నడిమ తిరువూరు
- శ్రీ వినాయకస్వామివారి ఆలయం, బైపాస్ రోడ్
- శ్రీ అష్టలక్ష్మి ఆలయం, రాజుపేట
- శ్రీ రంగానాయక స్వామి వారి ఆలయం, పాతూరు
- శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం, బస్సు స్టాండ్ సెంటర్
- శ్రీ శ్యామవేది మందిరం, చీరాల సెంటర్ దగ్గర.
- శ్రీ సీతారామస్వామివారి ఆలయం, పాతూరు.
తిరువూరు నియోజకవర్గం శాసనసభ్యులు
- 1989-1994 కోనేరు రంగరావు
- 1994-1999: నల్లగట్ల స్వామి దాసు
- 1999-2004: నల్లగట్ల స్వామి దాసు
- 2004-2009: కోనేరు రంగ రావు
- 2009-2014: దిరిసం పద్మజ్యోతి
- 2014-2019: కొక్కిలిగడ్డ రక్శననీధీ
తిరువూరు పట్టణ ప్రముఖులు
- షేక్ హుసేన్
- కె.రామారావు (డి.సి.యం.యస్. చైర్మెన్)
- టి. రమారావు (మార్కెట్ యార్ద్ చైర్మైన్)
- రామిశెట్టి విజయకృష్ణ ఐ.పి.ఎస్. అధికారి.
- సంకా వెంకట రామనరసింహారావు.
- యర్రమిల్లి సూర్యనారాయణమూర్తి: ఇతను ఈ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్.ఇతను దర్శకత్వం చేసి, తొలిగా నిర్మించిన "శ్వాస" అను లఘుచిత్రం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైంది. 2016,ఏప్రిల్-30, శనివారం రాత్రి కొత్తఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ఈ పురస్కార జ్యూరీ కమిటీ సభ్యులనుండి ఇతను ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.[6]
వనరులు
వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది తిరువూరు .
వెలుపలి లింకులు
[2] ఈనాడు కృష్ణా; 2014,మార్చి-10, 8వపేజీ.[3] ఈనాడు కృష్ణా; 2015,ఆగస్టు-15; 15వపేజీ.[4] ఈనాడు కృష్ణా; 2015,అక్టోబరు-15; 15వపేజీ.[5] ఈనాడు కృష్ణా; 2015,నవంబరు-6; 16వపేజీ.[6] ఈనాడు కృఇష్ణా; 2016,మే-3; 11వపేజీ.